భూపాలపల్లి నియోజకవర్గాన్ని, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గండ్ర వెంకటరమణా రెడ్డి ఎంతో కృషి చేశారంటూ తెరాస సీనియర్ నాయకుడు బుర్రా రమేశ్ పేర్కొన్నారు. 25 సంవత్సరాలు ఎనలేని సేవ చేస్తూ... భూపాలపల్లిని అభివృద్ధి బాటలో దూసుకెళ్లేలా చేస్తున్నారని తెలిపారు. సింగరేణి ఏరియాలో భూనిర్వాసితులకు పరిహారం ఇప్పించి.. నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లా కేంద్రంలో 100 పడకల ఆస్పత్రిని అభివృద్ధి చేశారని... 500 రెండు పడకగదులు ఇళ్లు పూర్తయ్యాయని మరో 500 ఇళ్లు కట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీరుస్తున్నారన్నారు. రైతుల అభిృవృద్ధి కోసం గండ్ర ఎంతో కృషి చేశారని అన్నారు.
ఇదీ చూడండి: నిధుల కేటాయింపులో జాప్యం.. గమ్యం చేరని రైలు