Tiger in Bhupalapallly: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పెద్దపులి దాడి కలకలం రేపింది. ఒడిపిలవంచ గ్రామ అటవీ ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేయగా ఓ ఆవు మృతి చెందింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొన్ని రోజులుగా జిల్లాలోని మహముత్తారం, మల్హర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని స్థానిక ప్రజలు తెలిపారు.
పులి పాద ముద్రలు, ఆనవాళ్లును అటవీశాఖ అధికారులు గుర్తించారు. జయశంకర్ జిల్లాలో పెద్దపులి సంచిరిస్తోందనే ప్రజల్లో భయాందోళన నెలకొంది. కాటారం శంకరంపల్లి వద్ద పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు... రుద్రారం, కొయ్యురు మీదుగా వెళ్లినట్లు భావిస్తున్నారు. ఆ తరువాత ఒడిపిలవంచ గ్రామంలో ఆవుల మందపై దాడి చేసిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఘటన స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకొని దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
సంబంధిత కథనాలు: Tiger Wandering: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం..
TIGER WANDERING: రహదారిపై పెద్దపులి సంచారం.. వీడియో తీసిన వాహనదారులు
Tiger: పశువుల మందపై పెద్దపులి దాడి.. ఆహారమైన లేగదూడ
Tiger near pakala Forest: రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం.. హడలెత్తిన వాహనదారులు