ETV Bharat / state

కాళేశ్వరంలో నేడు శ్రీవారి చక్ర స్నానం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేడు శ్రీవారికి ప్రత్యేక జలాభిషేకాలు జరిపించనున్నారు. తితిదే పండితులు రమణ దీక్షితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

Srivari Chakra snanam in Kaleswaram
కాళేశ్వరంలో నేడు శ్రీవారి చక్ర స్నానం
author img

By

Published : Feb 27, 2021, 6:14 AM IST

తితిదే తలపెట్టిన మాఘ మాస మహోత్సవంలో భాగంగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో నేడు మాఘ పూర్ణిమ పుణ్య స్నాన కార్యక్రమం జరగనుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు గోదావరి తీరంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక జలాభిషేకాలు, స్వామి వారి చక్రానికి ప్రవాహంలో పుణ్యస్నానాలు జరిపించనున్నారు.

తితిదే పండితులు రమణ దీక్షితుల ఆధ్వర్యంలో 50 మంది పండితులు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: హార్టికల్చర్‌ విధానం రూపొందించాలి: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.