ETV Bharat / state

'ప్రజల కోసమే పోలీసుల ఆంక్షలు.. వైరస్​ కట్టడికి సహకరించండి' - ఎస్పీ సంగ్రామ్​ సింగ్​జీ పాటిల్​

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని నో మూమెంట్​ ప్రాంతాల్లో ఎస్పీ సంగ్రామ్​ సింగ్​జీ పాటిల్​ పర్యటించారు. కరోనా కట్టడికై ప్రజలందరూ పోలీసులకు సహకరించి ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

sp sangram singh patil visit in no movement areas at jayashankar bhupalapalli
'ప్రజల కోసమే పోలీసుల ఆంక్షలు.. వైరస్​ కట్టడికి సహకరించండి'
author img

By

Published : Apr 8, 2020, 7:32 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గుర్తించిన నో మూమెంట్ ఏరియాలో ఎస్పీ సంగ్రామ్ సింగ్​ జీ పాటిల్ పర్యటించారు. వైరస్​ నియంత్రణకై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని ఆయన స్థానికులను కోరారు. నో మూమెంట్ ప్రాంతాలకు రాక, పోకలను నిషేధించడం జరిగిందని.. ప్రజలు దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలు బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉంటున్న వలస కూలీలకు, నిరుపేదలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.