ETV Bharat / state

గండ్ర దంపతులు కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు

కరోనా బారి నుంచి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు, వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి త్వరగా కోలుకోవాలని జిల్లా నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని సాయిబాబా ఆలయం, సీఎస్​ఐ చర్చి, మసీదును సందర్శించి వేడుకున్నారు.

prayers for the recovery of the mla gandra venkataramana reddy  couple from corona virus in jayashankar bhupalpally district
గండ్ర దంపతులు కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు
author img

By

Published : Feb 25, 2021, 9:14 PM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని జిల్లా నాయకులు సర్వమత ప్రార్థనలు చేశారు. ప్రజల అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేసే ఎమ్మెల్యే దంపతులు బాగుండాలని దేవుళ్లను వేడుకున్నారు. వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్మన్ గండ్ర జ్యోతి ఆరోగ్యం మెరుగుపడాలని జయశంకర్​ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని సాయిబాబా ఆలయం, సీఎస్​ఐ చర్చి, మసీదును సందర్శించారు.

పేద ప్రజల అభివృద్ధికి పాటుపడే మా నాయకులు కరోనా బారినా పడటం బాధాకరమని జిల్లా నాయకుడు బుర్ర రమేశ్​ అన్నారు. త్వరలోనే ఆరోగ్యవంతులుగా తిరిగిరావాలని సకల దేవతలను ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దుండ్ర మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు తుమ్మెటి రాగోత్తమ్ రెడ్డి, కుమార్ రెడ్డి, కరీం, కొల రాజమల్లు, పెడిపల్లి రమేశ్​, సాయిబాబా ఆలయ పూజారి శ్రీనివాస్ చారి, సీఎస్ఐ పాస్టర్, జవాహర్పాల్, ప్రేమ్, మసీద్​ ఇమామ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి : రాష్ట్రానికి మరోసారి స్కోచ్‌ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.