రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి నియోజక వర్గంలోని 317 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది పోలింగ్ సామగ్రితో బయలుదేరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయినందున గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: 'ఓటేసేందుకు దేశాలు దాటి రావాల్సిందేనా?'