ETV Bharat / state

సింగరేణి ఓపెన్​కాస్ట్​ పనులు... తెచ్చాయి కష్టాలు - ఓపెన్​కాస్టు పనులు

పరిశ్రమ కోసం తమ భూములు తీసుకుంటామంటే ఆ గ్రామస్థులు ఆనందపడ్డారు. కానీ తీసుకున్న భూములకు నష్టపరిహారం చెల్లించడంలో సంస్థ నిర్లక్ష్యం వారిని ఆవేదనకు గురిచేసింది. కాస్టింగ్​ పనుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు వారికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

ఓపెన్​ కాస్ట్​ పనులు
author img

By

Published : Apr 19, 2019, 11:35 AM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్​రావు మండలంలోని తాడిచర్ల గ్రామంలో సింగరేణి ఓపెన్​ కాస్ట్​ పనుల వల్ల గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వాధీనం చేసుకున్న భూములకు సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించకపోవడం, బ్లాస్టింగ్​లతో పంటలు, ఇళ్లు నాశనం అవ్వడం, ఓపెన్​ కాస్ట్​ వల్ల వచ్చే దుమ్ము, ధూళి వల్ల అనారోగ్య సమస్యలు వెరసి ఆ గ్రామస్థులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.

ఓపెన్​కాస్టు పనుల వల్ల తాడిచర్ల గ్రామస్థుల ఇబ్బందులు

అప్పుడు ఆనందం... ఇప్పుడు ఆవేదన

పదివేల జనాభా గల తాడిచర్లలో 12 సంవత్సరాల క్రితం ఓపెన్​కాస్ట్ కోసం ఏపీ జెన్​కో గ్రామస్థుల నుంచి భూముల స్వాధీనం కోరింది. మంచి ధరతో పాటు తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని వారంతా ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 2500 ఎకరాల సాగు భూముల్లో కొన్నింటిని స్వాధీనం చేశారు. అనంతరం ఈ ప్రాంతం సింగరేణి ఆధీనంలోకి మారిపోయింది. ఓపెన్​ కాస్ట్​ పనులు ప్రారంభమైన తరువాత వారి కష్టాలు మొదలయ్యాయి. పేలుళ్లతో వారు ఉంటున్న ఇళ్లకు పగుళ్లు ఏర్పడి ఎప్పుడు కూలుతాయోనని భయం భయంగా కాలం గడుపుతున్నారు.

అనారోగ్య సమస్యలు

పనుల జరిగే సమయంలో దుమ్ము, ధూళి వల్ల ఆస్తమా, దగ్గు, చూపు మందగించడం వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి తోటలు, తాటి వనాలు పాడైపోతున్నాయని వాపోతున్నారు.

ఉపాధికి కష్టం

అసౌకర్యాలు ఎలా ఉన్నా.. భూములిచ్చినందుకు తమకు ఉద్యోగాలైనా వస్తాయనుకుంటే.. అదీ లేదు. చేసేది లేక 30 కిలోమీటర్ల దూరంలోని వేరే ప్రాంతానికి కూలీ పనులకు వెళ్తున్నారు.
పంటలు పండించుకునేందుకు అవకాశం లేదు.. సింగరేణిలో ఉద్యోగం లేదు.. రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది తాడిచర్ల వాసుల పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని తమకు దారి చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : నిర్లక్ష్యం వీడి... వంతెన నిర్మించండయ్యా...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.