మేడ్చల్ జిల్లాలోని మాజిత్పూర్ గ్రామానికి చెందిన 100 మంది రైతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్‌ను చూసేందుకు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తమను పంపించారని అన్నదాతలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత రైతులకు నీళ్లు వస్తాయని చెప్పిన మాటలు నెరవేరుతాయని అనుకున్నామని, ఈ ప్రాజెక్టు చూసిన తరువాత కోటి ఎకరాలకు సర్కారు నీరు అందిస్తుందనే నమ్మకం వచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే కాళేశ్వరం ప్రాజైక్టు పూర్తంయిందని చెప్పారు. ఇంత పెద్ద ప్రాజెక్టును సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇవీ చూడండి: " ఐదు రూపాయల భోజనం ఎట్లుంది పెద్దాయన.."