జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కార్యాలయం ముందు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. బొగ్గు గనుల ప్రయివేటికరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వారికి అమ్మొద్దని, వేలం వేయొద్దని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పనినీ కొనసాగించాలన్నారు. మార్చి నెల ఆపిన సగం జీతం చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!