జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ నుంచి కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణిసంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరికి ప్రత్యేక పూజలు చేసి కార్తిక దీపాలు వదిలారు. స్వామివారిని దర్శించుకుని... ప్రత్యేక అభిషేకాలు చేశారు. అమ్మవారికి కుంకుమార్చన, నవగ్రహాల పూజలు నిర్వరించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
ఇదీ చూడండి : కార్తీక శోభతో వెలుగులీనుతున్న భాగ్యనగరం