ETV Bharat / state

కాళేశ్వరం అండర్​గ్రౌండ్​ టన్నెల్స్​లో నేడు ట్రయల్​ రన్ - trail run

తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టానికి నేడు అంకురార్పణ జరగనుంది. రాష్ట్రానికి సాగు, తాగు నీరందించాలనే సంకల్పంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం అండర్​ గ్రౌండ్​ టన్నెల్స్​లో ట్రయల్​ రన్​ జరుగుతోంది. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం సర్జిపూల్​కు నీటిని విడుదల చేసి లీకేజీలు పరిశీలించిన అధికారులు నేటి నుంచి ట్రయల్​ రన్​ ప్రారంభించనున్నారు.

కాళేశ్వరం అండర్​గ్రౌండ్​ టన్నెల్స్​లో నేడు ట్రయల్​ రన్
author img

By

Published : Apr 24, 2019, 6:08 AM IST

Updated : Apr 24, 2019, 7:49 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టానికి నేడు అంకురార్పణ జరగనుంది. ఎల్లంపల్లి ఎగువ భాగాన నిర్మాణం పూర్తి చేసుకున్న 6,7,8 ప్యాకేజీల్లో.. మోటార్ల ట్రయల్​ రన్​ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నీటి తరలింపులో లోపాలను గుర్తించడానికి ఏడు రోజులుగా 6వ ప్యాకేజీలో 0.2 టీఎంసీల నీటిని విడుదల చేసి పరీక్షించారు. వంద శాతం నీరు విడుదల చేయగా.. సర్జిపూల్​లో నీటిమట్టం 142.30 మీటర్లకు చేరింది.

నందిమేడారం మొదటి పంపుహౌజ్​ సిద్ధం

గజ ఈతగాళ్లతో లోపాల పరిశీలన

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు 1.1 కిలోమీటర్​ గ్రావిటీ కాలువ ద్వారా.. 9.543 కిలోమీటర్ల పొడవైన ట్విన్​ టన్నెల్​ ద్వారా, 6వ ప్యాకేజీలోని సర్జిపూల్కు పంపి ఆ తర్వాత తరలింపు నిలిపివేశారు. లీకేజీలతో పాటు ఇతర లోపాలు గుర్తించేందుకు విశాఖపట్నం, ఒడిశాల నుంచి గజ ఈతగాళ్ల బృందంతో పరిశీలన చేశారు. లోపాలేమి లేవని నిర్ధారించాక సర్జిపూల్​ నుంచి మోటార్లతో నీటిని పంపించేందుకు సిద్ధమయ్యారు.

నిర్ధారించుకున్నాకే.. నీటి విడుదల

సొరంగాలు, సర్జిపూల్​లో లోపాలు లేవని నిర్ధారించుకున్న అధికారులు సర్జిపూల్​ను వందశాతం (142.30 మీటర్లు) నింపి 6వ ప్యాకేజీలోకి నీటిని విడుదల చేశారు. సర్జిపూల్​లోని గేట్లు ఎత్తితే.. నీరంతా పంపుల్లోకి ప్రవేశిస్తుంది. మోటర్లు ఆన్​ చేయగానే నీరు.. సిస్టర్న్​ ద్వారా భూ ఉపరితలానికి చేరుకుంటుంది.

ప్రారంభించనున్న ఎస్కే జోషి, స్మితా సబర్వాల్​

6వ ప్యాకేజీకి సంబంధించి ట్రయల్‌ రన్​ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌‌ ప్రారంభించనున్నారు. ఈరోజు 90 క్యూసెక్కుల నీటిని ట్రయల్​ రన్​ ద్వారా మేడారం చెరువులోకి తరలించనున్నారు. ఈ ప్రక్రియలో గేట్ల వద్ద లీకేజీలను గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'సార్వత్రిక' మూడో దశలో 64.66% ఓటింగ్

Last Updated : Apr 24, 2019, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.