ETV Bharat / state

ఉప్పొంగిన కాళేశ్వర గంగ... జలసవ్వడులతో మారుమోగంగా...

కాళేశ్వరం ప్రాజెక్టులో గోదారమ్మ పరుగులు తీస్తోంది. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌజ్‌ నుంచి ఎగువకు కాళేశ్వర గంగ ఉరకలెత్తుతోంది. ఇక ప్రధానమైన కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌కు సంబంధించి మూడో టీఎంసీ పనులకు మోటార్ల బిగింపును అధికారులు వేగవంతం చేస్తున్నారు. సెప్టెంబర్ చివరకు లేదా అక్టోబర్ మొదటివారంలో ట్రయల్ రన్‌ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.

author img

By

Published : Aug 8, 2020, 3:23 AM IST

kaleshwaram project full filled with godawari water

కాళేశ్వరం ప్రాజెక్టు చెంత అద్భుత జలదృశ్యం కనువిందు చేస్తోంది. గోదారి నుంచి మానేరుకు జలధార వడవడిగా పరుగులు పెడుతోంది. నీటి సవ్వడులతో.... కాళేశ్వరం పరిసరాలు మారుమోగుతున్నాయి. మొత్తం 37 మోటార్లతో గోదావరి జలాలను వెనక్కి మళ్లించే ప్రక్రియ ఈ వర్షాకాలంలో మొదలైంది. 175 కిలోమీటర్ల మేర...గోదావరి జలాలు నిరాటకంగా సాగుతున్నాయి.

జలశోభితంగా త్రివేణి సంగమం

2019 జూన్ 21న ప్రారంభమైన ఆ ప్రాజెక్టు నుంచి తొలిసారి... ఏకకాలంలో అన్ని జలాశయాలకు అనుబంధంగా ఉన్న పంపుహౌజులతో నీటిఎత్తిపోతల మొదలైంది. 88 మీటర్ల నీటిమట్టం నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం జలాశయాల మీదుగా... 318 మీటర్ల స్థాయిలో ఉన్న మధ్యమానేరుకు నీటిని తరలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపుహౌజ్ నుంచి ఈ నెల 4 సాయంత్రం నుంచి నీటి ఎత్తిపోతల పర్వం విజయవంతంగా సాగుతోంది. మొత్తం 10 పైపుల ద్వారా నిరంతరాయంగా నీటిని గ్రావిటీ కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. కన్నెపెల్లి లక్ష్మీపంపుహౌస్ వద్ద 1.40 క్యూసెక్కుల ప్రవాహం నెలకొంది. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం జలశోభితంగా మారింది.

కరోనా కారణంగా కొంత ఆలస్యం...

కాళేశ్వరం వద్ద మూడో టీఎంసీ గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు పనులు చకచకా జరుగుతున్నాయి. తొలుత రోజుకు రెండు టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోయడానికి 11 మోటార్లు బిగించి విజయవంతంగా ఎత్తిపోశారు. గోదావరి జలాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు.... రోజుకు 3 టీఎంసీలను తరలించాలన్న నిర్ణయం మేరకు మూడో టీఎంసీ సంబంధించిన పనులను చేపట్టారు. ఈ వర్షాకాలం నాటికే అదనపు టీఎంసీ పనులు పూర్తి చేయాలని భావించినా... కొవిడ్‌ కారణంగా ఆస్ట్రియా, ఫిన్ ల్యాండ్​ల నుంచి పంపులు రావడం ఆలస్యమైంది. దీంతో పనుల్లో జాప్యం జరిగింది.

6 పంపుల బిగింపునకు చకచకా పనులు...

ఇటీవలే 40 మెగావాట్ల సామర్థ్యం గల 3 భారీ మోటార్లు కన్నెపల్లి పంపు హౌస్‌కు చేరుకున్నాయి. దీంతో మూడో టీఎంసీకి కావాల్సిన 6 మోటార్లు కాళేశ్వరానికి వచ్చేశాయి. ఇప్పటికే 12వ మోటారు పూర్తి స్థాయిలో బిగింపు కూడా పూర్తయ్యింది. 13వ మోటారు ఆగస్టు 2వ వారంలో 14, 15వ మోటార్లను సెప్టెంబర్‌ రెండో వారంలో... 16,17 మోటార్లను ఆ తరువాత బిగింపు పూర్తి చేసేందుకు కాళేశ్వరం ఇంజినీర్లు, సంస్థ ప్రతినిధులు షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. సెప్టెంబర్ మాసాంతానికి కానీ... అక్టోబర్ మొదటివారంలో కానీ.. మొత్తం 6 పంపుల బిగింపులు పూర్తి చేసి ఎత్తిపోతలు ప్రారంభించేలా యుద్ధప్రాతిపదికన అధికారులు పనులు చేపట్టారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.