ETV Bharat / state

సింగరేణి స్థలాల్లో ఇళ్ల క్రమబద్ధీకరణ - singareni

సింగరేణి స్థలాల్లో ఇళ్లు కట్టుకుని నివాసం ఉన్న వారికి శుభవార్త. వారికి పట్టాలు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆరు నెలల్లో పక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సింగరేణి స్థలాల్లో ఇళ్లు క్రమబద్ధీకరణ
author img

By

Published : Jul 27, 2019, 9:51 AM IST

ఎన్నో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి పక్కా పట్టాలు లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేక పోతున్నారని, వారికి వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇవాంటి వారు ఎంత మంది ఉంటున్నారనే సమాచారాన్ని సంస్థ సేకరించింది. భూమి బదలాయింపు తర్వాత పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

భూపాలపల్లి సింగరేణి ఏరియాలో పట్టాలు ఇవ్వాలనుకున్న భూములను ప్రభుత్వానికి బదలాయించింది. ఈనెల 23న ఏరియా జీఎం నిరీక్షణ్‌రాజ్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో సమావేశమయ్యారు. భూముల నివేదికను అప్పగించారు. ఇందులో సుభాష్‌కాలనీలో 32.37, కృష్ణాకాలనీలో 35.19 మొత్తంగా 68.16 ఎకరాలను బదలాయించారు. ఈ స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టనున్నారు. సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నామమాత్రపు ఫీజును నిర్ణయించింది. 100 చదరపు గజాల్లోపు నివాస స్థలం ఉన్న వారికి ఉచితంగానే క్రమబద్ధీకరిస్తారు. 100 నుంచి 500 లోపు అయితే చదరపు గజానికి రూ.25, 500 నుంచి 1000 లోపు గజానికి రూ.250 చొప్పున ఫీజు వసూలు చేయనున్నారు. వాణిజ్య సముదాయం కింద 500 లోపు గజానికి రూ.100, 500 నుంచి 1000లోపు గజానికి రూ.500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 1000 గజాలకుపైన ఉండే వాణిజ్య వినియోగ స్థలానికి మార్కెట్‌ విలువ ఆధారంగా ఫీజు తీసుకుంటారు.

ఎవరు అర్హులు
2014 జూన్‌ 2 కంటే ముందు ఎలాంటి అభ్యంతరం లేకుండా నివాసం ఉంటున్న వారు మాత్రమే అర్హులు. వీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నివాస గృహ యజమాని ఆధార్‌, ఓటరు కార్డు, ఇంటి పన్ను రశీదు, కరెంట్‌ బిల్లు, నీటి పన్ను రశీదు, ఇంటికి సంబంధించిన ఫొటో, కుటుంబ సభ్యుల ఫొటో, ఇంటి స్థల సర్వే నెంబర్‌, ఇంటి వైశాల్యానికి సంబంధించిన ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, భవన నిర్మాణ అనుమతి పత్రాలు ఆప్‌లోడ్‌ చేయాలి. 100 చదరపు గజాల కంటే ఎక్కువ స్థలం ఉన్న వారు స్థలం విలువపై 25 శాతం డీడీ తీయాల్సి ఉంటుంది.

క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు
దరఖాస్తు చేసుకున్న తర్వాత రెవెన్యూ అధికారులు సర్వే చేస్తారు. యజమానులు ఇచ్చిన వివరాలు సక్రమంగా ఉన్నాయా ? తప్పుడు సమాచారం ఇచ్చారా ? అన్న విషయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. సర్వే చేసిన తర్వాత భూమి విలువపై ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఇదీ చూడండి : స్నేహితులతో కలిసి పెద్దమ్మ ఇంటికి కన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.