ETV Bharat / state

పంట కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్​ సమావేశం - paddy purchase centers

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​లో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలు అధికారులతో సమావేశం నిర్వహించి వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్షించారు. ధాన్యం నిల్వ ఉంచకుండా వెంటనే మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్​ అధికారులను ఆదేశించారు.

jayashankar bhupalpally collector meeting with district officers
పంట కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్​ సమావేశం
author img

By

Published : Apr 28, 2020, 8:39 PM IST

కొనుగోలు చేసిన వరి ధాన్యంను నిల్వ ఉంచకుండా వెంటనే మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​లో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలు అధికారులతో సమావేశం నిర్వహించి వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్షించారు. జిల్లాలో 189 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 23 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని వ్యవసాయ, మార్క్​ఫెడ్​ శాఖల అధికారులు వివరించారు.

జిల్లాలో వరి, మొక్కజొన్న పంటల కొనుగోళ్ల కోసం రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్​ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచకుండా వెంటనే మిల్లులకు పంపించి రైతులకు త్వరగా డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టోకెన్ల ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొని వచ్చే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.

ఇవీ చూడండి: ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.