ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఉల్లంఘిస్తే కేసులతో పాటు, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా చేరవద్దని, అనవసర విందులు నిర్వహించవద్దని కోరుతూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కరోనా వైరస్ నిర్మూలనలో అందరూ భాగం కావాలని.. నిరభ్యంతరంగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మాస్కు ధరించకపోతే వారి ప్రవేశాన్ని నిషేధించాలని దుకాణాలు, కార్యాలయాలకు సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: ఉపఎన్నిక వేళ... వెక్కిరిస్తోన్న సమస్యల మేళా...