తెలంగాణలో బీడువారిన భూముల్లో గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉరకేలేస్తోంది. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా చేరటం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. బ్యాక్‌వాటర్‌ను కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజీలోకి అధికారులు నీటిని పంపు చేస్తున్నారు.
ఇవీచూడండి: కర్'నాటకీయం' లైవ్: తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మండిపడ్డ స్పీకర్