జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో వాన విస్తారంగా పడుతోంది. జిల్లావ్యాప్తంగా 191.2 శాతం వర్షపాతం నమోదైంది. జిల్లాలో 11 మండలాల్లో భారీ వర్షం తెల్లవారుజాము నుంచి కురుస్తోంది.
వర్షపాతం నమోదు వివరాలు
- రేగొండ 76 సెం. మీ.
- గణపురం 45.2 సెం. మీ.
- మొగుళ్లపల్లి 27.4 సెం. మీ.
- చిట్యాల 23.2 సెం. మీ.
- భూపాలపల్లి 10.2 సెం. మీ.
- కాటారం 1.4 సెం. మీ.
వర్షం ఎక్కువగా కురవడం వల్ల పలు చోట్ల అక్కడక్కడ చెరువులు, వాగులు నిండిపోయాయి. రేగొండ మండలంలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండిః వర్షం వస్తే రోడ్లు చెరువులవుతున్నాయి!