జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కాటారం మండలం వీరాపూర్ సమీపంలోని శివశంకర్ ప్రాజెక్టు కట్టకు గండి పడింది. సమీపంలోని ఆయకట్టు పొలాలు నీట మునిగిపోయాయని... రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహా ముత్తారం మండలంలో కురిసిన అతి భారీ వర్షం వర్షం కారణంగా... వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: భాగ్యనగరంలో వర్షం.. పలు చోట్ల ప్రజలకు ఇక్కట్లు