ETV Bharat / state

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీలో వరద ప్రవాహం - Kaleshwaram updates

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram)కు వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాణహిత నది ఉద్ధృతితో ప్రవహిస్తోంది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.

Heavy
వరద ప్రవాహం
author img

By

Published : Jul 11, 2021, 9:38 PM IST

Updated : Jul 12, 2021, 7:19 AM IST

రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో ప్రవాహం జోరందుకుంది. ప్రాణహిత, గోదావరి సంగమం నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీ గేట్లు తెరిచి 1.02 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నీరంతా దిగువన కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజీకి (తుపాకులగూడెం) చేరుకుంటోంది. ఈ బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 6.97 టీఎంసీలు. ఎగువ నుంచి వస్తున్న 80వేల క్యూసెక్కులను 12 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. మరోవైపు ఏపీలోని ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 18 వేల క్యూసెక్కులు సముద్రంవైపు విడిచిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు నుంచి 5689 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయంలోకి 28వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలకు 16.46 టీఎంసీల నిల్వ ఉంది.

లక్ష్మీ బ్యారేజీ నుంచి పార్వతి, సరస్వతి బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి జూన్‌ 18 నుంచి జులై 9 వరకు 30 టీఎంసీలు నీటిని ఎత్తిపోశారు. ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రి ఎత్తిపోతల ద్వారా మధ్య మానేరుకు 24 టీఎంసీల వరకు నీటిని తరలించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

ఆలమట్టి వద్ద మళ్లీ జోరు

కృష్ణా పరీవాహకంలో ఆలమట్టికి మళ్లీ ప్రవాహం మొదలయింది. ఆదివారం సాయంత్రానికి పదివేల క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని నారాయణపూర్‌ వైపు విడుదల చేస్తున్నారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు ప్రవాహాలు పెద్దగా లేవు. పులిచింతలకు కూడా 2,000 క్యూసెక్కులు మాత్రమే వస్తుండగా విద్యుదుత్పత్తి అనంతరం 5,000 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ఇక్కడి నుంచి 11,835 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు.

మేడిగడ్డ బ్యారేజీ

ఇదీ చూడండి: SRISAILAM DAM: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

Last Updated : Jul 12, 2021, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.