బీడు బారిన భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌హౌజ్‌ను తొలుత సందర్శించారు. గోదావరి జలాల ఎత్తిపోతల జరిగే విధానాన్ని, ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు గవర్నర్‌కు వివరించారు.
అనంతరం పంప్‌హౌజ్‌లో నిర్మించిన పంపులను, కంట్రోల్ రూంను సందర్శించారు. తక్కువ సమయంలో అద్భుత నిర్మాణం చేశారంటూ ప్రాజెక్టు ఇంజినీర్లను గవర్నర్ అభినందించారు. ప్రాజెక్టు సామర్థ్యం, గేట్ల నిర్మాణం, వరద ప్రవాహం, తదితర అంశాలను ఈఎన్‌సీ గవర్నర్‌కు వివరించారు. వ్యూ పాయింట్ నుంచి బ్యారేజీని వీక్షించించిన ఆమె... బ్యారేజీ పైకి వెళ్లి నిర్మాణాన్ని పరిశీలించారు.
ఇదీ చూడండి: బంగారు టాయ్‌లెట్‌ను దొంగలెత్తుకెళ్లారు..!