ETV Bharat / state

'వీఆర్పోలను నిర్బంధించిన రైతులు'

పట్టా పాసుపుస్తకాలివ్వాలని అధికారుల చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా పట్టించుకోకపోవడంతో గ్రామంలోకి వచ్చిన వీఆర్వోలను నిర్బంధించారు.

'వీఆర్పోలను నిర్బంధించిన రైతులు'
author img

By

Published : Jun 11, 2019, 7:58 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లంకుంట గ్రామంలోని కొందరు రైతులు తమ ఊరికి వచ్చిన వీఆర్వోలను నిర్బంధించారు. చాలా రోజులుగా తమ భూముల పట్టా చేసివ్వాలని, పాసు పుస్తకాలివ్వాలని తిరిగినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమే సోమవారం రోజు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయగా... రేపు వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు. ఈరోజు తహశీల్దార్​కి బదులుగా ముగ్గురు వీఆర్వోలను పంపించారు.

కోపోద్రిక్తులైన రైతన్నలు వీఆర్వోలు రవి, సురేందర్, మల్లేశ్​లను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బం ధించారు. అనంతరం తాళం వేసి బయట కూర్చున్నారు. గ్రామ సర్పంచ్, గ్రామస్థులు వచ్చి నచ్చజెప్పడంతో తాళం తీశారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

'వీఆర్పోలను నిర్బంధించిన రైతులు'

ఇవీ చూడండి: రవిప్రకాశ్​ బెయిల్​ పిటిషన్​ విచారణ మళ్లీ వాయిదా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.