మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా అభివృద్ధి చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మహబూబాబాద్, నెల్లికుదురులలో 14.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మొక్కలు నాటారు. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సంసిద్ధంగా ఉన్నారని... మానుకోట పట్టణంలో సమీకృత మార్కెట్ కాంప్లెక్స్, స్మశాన వాటికలను నిర్మిస్తామని, త్వరలో నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా మహబూబాబాద్‌కు వచ్చి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి, పోడు భూముల సమస్య ను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, బోడ కుంట్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
'ఏ జిల్లాలో జరగని విధంగా అభివృద్ధి చేస్తా: ఎర్రబెల్లి'
మహబూబాబాద్, నెల్లికుదురులలో 14.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎర్రబెల్లి దయాకర్ శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. జిల్లాను అభివృద్ధి చేస్తానని హామినిచ్చారు.
మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా అభివృద్ధి చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మహబూబాబాద్, నెల్లికుదురులలో 14.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మొక్కలు నాటారు. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సంసిద్ధంగా ఉన్నారని... మానుకోట పట్టణంలో సమీకృత మార్కెట్ కాంప్లెక్స్, స్మశాన వాటికలను నిర్మిస్తామని, త్వరలో నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా మహబూబాబాద్‌కు వచ్చి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి, పోడు భూముల సమస్య ను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, బోడ కుంట్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
TAGGED:
ERRABELLI