పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.
సీఆర్పీఎఫ్ సమాజ సేవ - లక్నవరం
దేశ రక్షణలోనే కాదు ప్రజా సేవలో ముందుంటామని నిరూపిస్తున్నారు సీఆర్పీఎఫ్ జవాన్లు. ములుగు జిల్లా లక్నవరంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది
ములుగు జిల్లా లక్నవరంలోని రాయిని గూడెం గ్రామంలో 39వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. కొత్తూరు, పంచోత్కులపల్లి, దుబ్బ గూడెం, పెగడపల్లి గ్రామాల నుంచి వందలాది మంది నిరుపేదలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి మందులు ఇస్తున్నామని మెడికల్ ఆఫీసర్ రూప తెలిపారు.
పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.