ETV Bharat / state

'రూ.28వేల కోట్ల ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేశారు' - కాళేశ్వరాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెరాస ప్రభుత్వం పబ్బం గడుపుతోందని, ప్రాజెక్టుతో కోట్లాది రూపాయలను నాయకులు దండుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో భట్టి పర్యటించారు.

bhatti vikramarka
భట్టి విక్రమార్క
author img

By

Published : Feb 12, 2021, 8:27 PM IST

ప్రాజెక్టు రీ డిజైన్​ పేరుతో కేవలం రూ.28వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. రాష్ట్ర ప్రజల నిధులను తెరాస ప్రభుత్వం దోపిడీ చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో భట్టి పర్యటించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మధుయాష్కీతో కలిసి కాళేశ్వరాన్ని సందర్శించారు.

గురువారం రాత్రి కాళేశ్వరానికి చేరుకున్న నేతలు.. స్థానిక హోటల్​లో బస చేసి ఇవాళ ఉదయం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూసుకుపల్లి, మద్దులపల్లి, చండ్రుపల్లి, అన్నారం మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సరస్వతీ(అన్నారం)బ్యారేజీని సందర్శించి పరిశీలించారు. బ్యారేజీ పనితీరుపై ఇరిగేషన్ అధికారులు వివరించారు.

ఒక్క ఎకరానికైనా నీళ్లివ్వలేదు

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెరాస ప్రభుత్వం పబ్బం గడుపుతోందని భట్టి విమర్శించారు. ప్రాజెక్టుతో కోట్లాది రూపాయలు దండుకున్నారని భట్టి ఆరోపించారు. రాష్ట్రానికి మూడేళ్లలో రావాల్సిన నీళ్లు ఏడేళ్లయినా రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికైనా నీళ్లివ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు అందించే నీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలోనే రూపకల్పన జరిగిందని అన్నారు.

ఇదీ చదవండి: ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలి: సీఎస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.