ETV Bharat / state

ఇంకా చల్లారని భూపాలపల్లి.. ముదురుతున్న బీఆర్​ఎస్, కాంగ్రెస్​ వార్​ - Clash between BRS Congress leaders

Clash between Congress BRs in Bhupalapalli: గత రాత్రి జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య రేగిన రాజకీయ వివాదం ఇంకా చల్లారడం లేదు. ఇవాళ కూడా జిల్లాలో పలుచోట్ల ఇరువర్గాలకు చెందిన నాయకులు పోటిపోటిగా దిష్టిబొమ్మలను తగలపెట్టే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీలకు చెందిన వారు పోటాపోటీగా నినాదాలు, తోపులాటలో జిల్లాలోని టేకుమట్ల మండల కేంద్రం రణరంగంగా మారింది. పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని చెదరగొట్టడంతో గొడవ కాస్త సద్దుమణిగింది.

Clash between BRS and Congress
Clash between BRS and Congress
author img

By

Published : Mar 1, 2023, 8:52 PM IST

Clash between Congress BRs in Bhupalapalli: "హాథ్ సే హాథ్​ జోడో యాత్ర" లో భాగంగా జయశంకర్​ భూపాలపల్లికలో రేవంత్​ రెడ్డి బహిరంగ సభలో మొదలైన బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాయకుల మధ్య రేగిన రాజకీయ చిచ్చు ఇంకా రాావణకాష్ఠంలా కాలుతూనే ఉంది. జిల్లాలో ఎక్కడిక్కడ ఇవాళ కూడా కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోనేందుకు యత్నించారు.

జిల్లాలోని టేకుమట్ల మండల కేంద్రంలో ఇరు పార్టీలకు చెందిన వందలమంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పోటాపోటీగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను, కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దిష్టిబొమ్మలను తగలపెట్టే పయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగటంతో ఇరు పార్టీలోని కొందరి నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటానాస్థలికి చేరుకొని ఇరువార్గాల వారిని చెదరగొట్టారు. దీంతో వివాదం ప్రస్తుతం కాస్త సద్దుమణిగినా.. ఎప్పుడు ఏం జరుగుతోందోనని స్థానిక ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు.

వివాదం ఇలా మొదలైంది: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చేస్తున్న"హాథ్ సే హాథ్​ జోడో యాత్ర" ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. నిన్న ఉదయం జిల్లాలోని కాశీంపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేసిన రేవంత్‌.. రాత్రి భూపాలపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో సుమారు వంద మంది బీఆర్​ఎస్​ కార్యకర్తలు రేవంత్​ సభ వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రేవంత్​ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అక్కడితో ఆగకుండా సభపైకి కోడుగుడ్లు, టమాటోలు, రాళ్లు విసిరారు. రేవంత్​ రెడ్డి లక్ష్యంగా కొందరు రాళ్లు విసరడంతో అక్కడున్న నాయకుల సాలువా అడ్డుపెట్టి రాళ్లు పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. వారు కూడా బీఆర్​ఎస్​ నాయకులపై రాళ్లు రువ్వడంతో అక్కడ పరిస్థితి కాస్త గందరగోళం, భయందోళనకరంగా మారింది. పరిస్థితిని గమనించిన పోలీసులు ఇరువర్గాలు వారిని చెదరగొట్టారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలను స్థానిక థియేటర్​లో బంధించారు. దీంతో థియేటర్​పై రాళ్లు విసరడంతో వాటి అద్దలు పగిలాయి. స్థానిక ఎస్సై శ్రీనివాస్​కు తలకు గాయం కాగా ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తాజా ఘటనలతో ఏ నిమిషం ఏం జరుగుతోందని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

ఇంకా చల్లారని భూపాలపల్లి.. ముదురుతున్న బీఆర్​ఎస్, కాంగ్రెస్​ వార్​

ఇవీ చదవండి:

భూపాలపల్లిలో రేవంత్‌రెడ్డి బహిరంగ సభ వద్ద ఉద్రిక్తత.. ఎస్‌ఐ, పలువురికి తీవ్ర గాయాలు

సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణకు సిద్ధమా..?: రేవంత్​రెడ్డి

పాదయాత్రను చూసి.. ఓర్వలేకే ఈ దాడులు: రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.