ETV Bharat / state

బడుల నిర్వహణకు నిధులు విడుదల - జయశంకర్‌ భుపాల్​పల్లి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఏ లోటూ రాకుండా చూసేందుకు కావాల్సిన నిధులను అందిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు నిధులను విడుదల చేసింది.

బడుల నిర్వహణకు నిధులు విడుదల
author img

By

Published : Jul 29, 2019, 10:47 AM IST

Updated : Jul 29, 2019, 11:46 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం నిధులను అందిస్తోంది. ఈ నేపథ్యంలో జయశంకర్‌, ములుగు, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లోని సర్కారు బడుల నిర్వహణకు, స్వచ్ఛ కార్మికుల వేతనాలకు తొలిదశ నిధులను విడుదల చేసింది. పాఠశాలల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) ఖాతాల్లో వీటిని జమ చేసింది.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు
పాఠశాల నిర్వహణ నిధులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా విడుదల చేస్తారు. 2019-20 విద్యా సంవత్సరానికి బడుల్లో 100 మంది విద్యార్థులుంటే రూ.10 వేలు, 100 నుంచి 250 మంది ఉంటే రూ.15 వేలు, 250 నుంచి 1000 వరకు ఉంటే రూ.40 వేలు, వెయ్యికి పైగా విద్యార్థులుంటే రూ.60 వేల చొప్పున నిధులిస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా కేటాయిస్తారు. మూడు దశల్లో గ్రాంటు ఇవ్వనున్నారు. ప్రస్తుతం వచ్చినవి మొదటి దశవి. వచ్చే ఎనిమిది నెలల్లో మరో రెండు దశల నిధులు విడుదలవుతాయి.

గతేడాది వేతనాలు..?
ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు స్వచ్ఛ కార్మికులను నియమించింది. ఒక్కో కార్మికుడికి రూ.2500 చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం తొలిదశలో 5 నెలలకు సంబంధించిన వేతనాలు విడుదలయ్యాయి. పది నెలల పాటు వేతనాలిస్తారు. వీరి వేతనాలు కూడా ఎస్‌ఎంసీ ఖాతాల్లోనే జమయ్యాయి. గతేడాదికి సంబంధించిన నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.

నిర్వహణ ఖర్చులు
పాఠశాలల్లో చాక్‌పీసులు, బోర్డుల మరమ్మతులు, డస్టర్లు, హాజరు పట్టిక రిజిస్టర్లు, విద్యుత్తు బిల్లు, సామగ్రి బిల్లులు, స్టేషనరీ, జనవరి, ఆగస్టులో జెండా వందనం కార్యక్రమ నిర్వహణ ఖర్చులు, విద్యార్థులకు బహుమతులు, ఇలా పాఠశాలకు అవసరమైనవి కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. గతేడాది నిధులను విద్యా సంవత్సరం చివరలో విడుదల చేయడంతో అప్పటివరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే సొంతంగా ఖర్చులు భరించి ఆయా సౌకర్యాలను కల్పించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇక అన్ని జబ్బులకూ ఆరోగ్యశ్రీ..!

Last Updated : Jul 29, 2019, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.