ETV Bharat / state

పులి వచ్చే కోతి పరిగెత్తే.. సర్పంచ్​ ఆలోచనకి ఫిదా అవ్వాల్సిందే - Sarpanch has a new idea to protect from monkey

idea to protect from monkeys: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలోని కోతుల బెడత నుంచి తప్పించేందుకు స్థానిక సర్పంచ్‌ నిశిధర్‌ రెడ్డి వినూత్న ఆలోచన చేశారు. గ్రామ పంచాయతి సిబ్బందిలో రోజుకొకరికి చిరుతపులి వేషధారణ వేయించి ఆ ప్రాంతంలో తిప్పుతూ కోతులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పులి వేషంతో ఉన్నవాళ్లను చూసి కోతులు పారిపోతున్నాయని సర్పంచ్​ పేర్కొన్నారు.

protect from monkeys
protect from monkeys
author img

By

Published : Oct 23, 2022, 1:21 PM IST

idea to protect from monkeys: కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు చిరుత పులి వేషధారణ వేయించి కోతుల భయం తప్పిస్తున్నాడు భూపాలపల్లి జిల్లా రేగొండ గ్రామ సర్పంచ్ నిషిధర్ రెడ్డి.. అనేకసార్లు స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్​కు, అధికారులకు మొరపెట్టుకున్న వారు పట్టించుకోకపోవడంతో ఎలాగైనా కోతుల బెడద తగ్గించాలని తానే అనేక ప్రయత్నాలు చేశారు.

సామాజిక మాధ్యమాల్లో కరీంనగర్ జిల్లా శంకరపట్నం గ్రామంలో చిరుతపులి వేషధారణ వేసి కోతులు బెడద నుంచి కాపాడుకున్న ఓ గ్రామం కథ తెలుసుకొని ఇలా ప్రయత్నం చేశానని తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఒకరు చిరుతపులి వేషధారణ వేసి కోతులను తరిమికొడుతున్నాడు. ఆ వ్యక్తిని గమనించిన కోతులు భయపడి పారిపోయినట్లు సర్పంచ్ నిషిధర్ రెడ్డి అంటున్నారు.

చిరుత పులి వేషధారణ డ్రెస్సుకు రూ. 3500, పులి బొమ్మకు రూ.2000 ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేషధారణ వల్ల మంచి ఫలితం లభించిందని సర్పంచి నిషిధర్ రెడ్డి పేర్కొన్నారు.. ప్రతి గ్రామంలో కూడా ఇలా చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుందని తెలిపారు.

పులి వచ్చే కోతి పరిగెత్తే.. సర్పంచ్​ ఆలోచనకి ఫిదా అవ్వాల్సిందే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.