ETV Bharat / state

అన్నారం బ్యారేజీలో బుంగలకు మరమ్మతులు పూర్తి - అన్నారం బ్యారేజీ మరమ్మతులు పూర్తి

Annaram Barrage Repaire Work Completed : అన్నారం సరస్వతి బ్యారేజీకి సీపేజీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన మరమ్మతు పనులను ఆప్కాన్స్ సంస్థ పూర్తి చేసింది. పాలియూరిథిన్​ గ్రౌటింగ్​ ద్వారా 38, 42 పియర్​ల వద్ద ఏర్పడిన బుంగలను పూడ్చింది.

Annaram Saraswati Barrage Leakage
Annaram Saraswati Barrage Leakage
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 2:17 PM IST

Annaram Barrage Repaire Work Completed : రాష్ట్రవ్యాప్తంగా అన్నారం బ్యారేజీలో సీపేజీ ఏర్పడిన విషయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో దీనిపై కాంగ్రెస్, బీఆర్​ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలాయి. దీనికి గత కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాలని అప్పటి ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్యారేజీ మరమ్మతులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అన్నారం బ్యారేజీలో (Annaram Barrage) ఏర్పడిన బుంగల మరమ్మతుల పనులను నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ పూర్తి చేసింది.

Seepage at Two Places in Annaram Barrage : గతేడాది నవంబర్‌లో 38, 28 పియర్‌ల వద్ద సీపేజీ ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పుడే అప్రమత్తమైన అధికారులు రాళ్లు, ఇసుక సంచులతో తాత్కాలిక మరమ్మతు చేసి లీకేజీని అదుపు చేశారు. బుంగల నుంచి ఇసుక బయటికి పోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల అన్నారం బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం రెండు బుంగలతో ప్రమాదమేమి లేదని తేల్చారు. నిర్మాణ సంస్థతో గ్రౌటింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక

Annaram Saraswati Barrage Leakage : ఇందులో భాగంగానే ఆప్కాన్స్ సంస్థ ప్రత్యేకంగా హిమాచల్‌ప్రదేశ్ నుంచి హెలికాప్టర్‌లో పాలియూరిథిన్​ అనే కెమికల్ తెప్పించి, వంతెనలోని 38, 28 పియర్‌ల వద్ద బుంగలకు గ్రౌటింగ్ పనులను చేయించింది. రెండు పియర్స్ వద్ద ఏర్పడిన సీపేజీ మరమ్మతు పూర్తయినట్లు ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి.

Vigilance and Enforcement on Kaleshwaram Project : మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) ప్రభుత్వం విజిలైన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కొనసాగుతోంది. ఆ శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్‌ రతన్ దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అధికారుల బృందం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ సంబంధించిన ఇంజినీరింగ్ అధికారులను విచారించింది. పలు అంశాలకు సంబంధించిన సమాచారం తెలుసుకొని, కొన్ని ఫైళ్లు, హర్డ్‌డిస్క్‌లు ఎక్కడ ఉన్నాయో ఆరా తీసినట్లు తెలిసింది.

అన్నారం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర డ్యాంసేఫ్టీ బృందం

కాళేశ్వరం నుంచి అధికారుల బృందం మేడిగడ్డ బ్యారేజీ వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న, కుంగిన పియర్స్, ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. కన్నేపల్లి పంప్‌హౌస్‌ను, అన్నారం వంతెనను కూడా డీజీ బృందం పరిశీలించింది. విజిలైన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం విచారణ అంత రహస్యంగా సాగుతోంది. స్థానిక పోలీసు అధికారులను సైతం అనుమతించడం లేదు. పోలీస్ బందోబస్తు అవసరం ఏర్పడిన సమయంలో స్థానికేతర, జిల్లా కేంద్రంలోని పోలీసులు సహాకారం తీసుకుంటున్నారు. రెండు రోజుల పాటు విచారణ సాగనుందనిని తెలుస్తోంది. డీజీ వెంట ఎస్పీ శ్రీనివాసులు, ఉన్నతాధికారులు సైతం ఉన్నారు.

మేడిగడ్డ, అన్నారం పునరుద్ధరణపై చేతులెత్తేసిన సీడీవో

'మేడిగడ్డ' ఘటనలో ఊహించని ట్విస్ట్ - పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ నిర్మాణ సంస్థ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.