YS Sharmila visited the farmers: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్రంగా పంట నష్టపోయిన రైతులను వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలింపూర్, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో వడగళ్ల వర్షానికి నష్టపోయిన వరి పంట, మామిడి పంటలను పరిశీలించారు. అనంతరం షర్మిల రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి బాధలు విని ప్రభుత్వంపై పలు విమర్శలు చేెశారు. కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బంగారు తెలంగాణలో రైతుకు విలువ ఉందా అని ప్రశ్నించారు. గత 9 సంవత్సరాల్లో వర్షాలకు సుమారు రూ.14 వేల కోట్లు నష్టం జరిగిందని పేర్కొన్నారు.
కేసీఆర్ రాజీనామా చేయాలి: దీనికి పరిహారం కింద కనీసం ఒక్క రూపాయి అయినా ఏ ఒక్క రైతుకు ఇచ్చారని నిలదీశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరవాత పంట బీమా ఇవ్వట్లేదని విమర్శించారు. రైతులకు ఇంత అన్యాయం చేస్తూ.. ఈ పాలన ఎందుకని ప్రశ్నించారు. నష్టపోయిన ప్రతి రైతుకు సమాధానం చెప్పి తీరాలని అన్నారు. పరిపాలన రాకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలని అన్నారు. కర్షకులకు కనీసం ఎకరానికి రూ.30వేలు పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకువస్తారని ఆమె హామి ఇచ్చారు.
"రైతులందరూ ఓట్లు వేసి గెలిపిస్తేనే కదా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి వాళ్లకి కష్ట వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు. మీరు ఉన్నతంగా బతికితే సరిపోతుందా? రైతు బతకవద్దా? అసలు ఈ రాష్ట్రంలో రైతు పండించిన పంటకి విలువ ఉందా? బంగారు తెలంగాణలో రైతుకు గౌరవం ఉందా? రైతుకు చిన్న కష్టం వస్తే చాలు మళ్లీ తేరుకునేందుకు రెండు, మూడేళ్లు పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద కష్టం వచ్చింది.. ఆదుకోకపోతే ఎలా? గత 9 సంవత్సరాల్లో వానలు, వరదలు, వడగళ్లు వచ్చి రైతులు నష్టపోతున్నారు. ఎప్పుడైనా పరిహారం చెల్లించారా? రాష్ట్రంలో రూ.14 వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత పంట బీమా , పరిహారం రెండు లేవు. రైతులందరికీ సమాధానం చెప్పాలి. కనీసం పరిహారం కింద రూ.30000 ఇవ్వాలి. పాలన రాకపోతే రాజీనామా చేయండి. పరిహారిం కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను."- వైఎస్ షర్మిల, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
ఇవీ చదవండి: