ETV Bharat / state

Warangal TRS Leaders meeting: ఈనెల 20న కేసీఆర్ జనగామ టూర్... ఏర్పాట్లలో వరంగల్‌ నేతలు - CM KCR District Tour

Warangal TRS Leaders meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన విజయవంతం చేయడంపై తెరాస నేతలు దృష్టి సారించారు. ఈ మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్​ పర్యటన సందర్భంగా చేపట్టే సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.

TRS Leaders meeting
TRS Leaders meeting
author img

By

Published : Dec 16, 2021, 2:38 PM IST

Warangal TRS Leaders meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన విజయవంతం చేయడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా తెరాస నేతలు దృష్టి సారించారు. ఈ మేరకు హైదరాబాద్​లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్​ సమావేశమయ్యారు. ఈ నెల 20న జనగామలో పర్యటించనున్న సీఎం కేసీఆర్... పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా చేపట్టే సంక్షేమ‌, అభివృద్ధి, పార్టీ కార్యక్రమాల ఏర్పాట్లపై సమావేశంలో మంత్రులు చర్చించారు. అన్ని ప‌నులు పూర్తి సమన్వయంతో చేయాలని జిల్లా నేతలను కోరారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రస్తుత స్థితి... వాటికి సంబంధించిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేలా ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి సభ కోసం మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించి బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM KCR District Tour: సీఎం కేసీఆర్​ జిల్లాల పర్యటన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.