ETV Bharat / state

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ధ్వని కాలుష్యం - ధ్వని కాలుష్యం

ధ్వని కాలుష్యం నుంచి ఉపశమనం పొందాలంటే మొక్కలను పెంచాలి, చట్టాలను కఠినంగా అమలు చేయాలి. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే ధ్వని కాలుష్యాన్ని నియంత్రించాలని జనగామ జిల్లాలో అవగాహన ర్యాలీని నిర్వహించారు.

ప్రమాదంగా ధ్వని కాలుష్యం
author img

By

Published : Jul 6, 2019, 10:03 AM IST

ఆధునిక కాలంలో మానవుని చర్యల ఫలితంగా కనిపించని ప్రమాద ఘంటికగా మారిన ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు అవగాహన సదస్సులు ఎంతగానో దోహదపడతాయని జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ధ్వని కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ఎన్‌సీసీ బాధ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. అధిక ధ్వని కాలుష్యం వల్ల ప్రజలకు తెలియకుండానే అనేక రోగాలు ఉత్పన్నమవుతాయని, 60 డెసిబెల్స్‌ ధ్వని స్థాయి కంటే ఎక్కువ శబ్ధాలు గుండెపోటుకు దారి తీస్తాయని పేర్కొన్నారు.

ధ్వని కాలుష్యం నుంచి ఉపశమనం పొందాలంటే మొక్కలను పెంచాలని, చట్టాలను కఠినంగా అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఎన్‌సీసీ కేడెట్లు కళాశాల ప్రాంగణంలో శ్రమదానం చేసి కళాశాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

ఇదీ చూడండి : ఇవాళే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.