ETV Bharat / state

గ్రామాల్లో నిఘా నేత్రాలు.. ఇక నుంచి ప్రతిక్షణం పర్యవేక్షణ! - జనగామ జిల్లా వార్తలు

పల్లెలూ ఇక భద్రంగా ఉండనున్నాయి. గ్రామాల్లో నేరాల నియంత్రణకు, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేలా పోలీసులు నిఘానేత్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వేర్వేరు ఘటనల అనంతరం ప్రతి గ్రామంలో దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. అధికారుల ఆదేశాలతో గ్రామాల్లో పర్యటించిన పోలీసులు గ్రామస్థులకు అవగాహన కల్పించి కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. మానుకోట చిన్నారి హత్య కేసులో సీసీ ఫుటేజీలు ఎంతోగానో పడయోగపడ్డాయి.

గ్రామాల్లో నిఘా నేత్రాలు.. ఇక నుంచి ప్రతిక్షణం పర్యవేక్షణ

author img

By

Published : Dec 19, 2020, 11:44 AM IST

ప్రతి ఊరూ అనుసంధానం

ప్రతి పల్లె, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలను ఆయా పోలీస్‌ స్టేషన్లలోని కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేశారు. అక్కడనుంచి కమిషనరేట్‌కు అనుసంధానం చేశారు. ఫలితంగా గ్రామాల్లో జరిగిన అనివార్య సంఘటలను ఆయా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గ్రామానికి నియమించిన ప్రత్యేక పోలీసు అధికారితోపాటు మండల కేంద్రంలోనూ ఓ అధికారి సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఎంతో ప్రయోజనం

రాత్రి వేళ గుర్తుతెలియని వాహనాల ద్వారా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే వీటి ఆధారంగా గుర్తిస్తున్నారు. ఎవరైనా గొడవలకు పాల్పడినా, ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా, ఘర్షణలు చోటుచేసుకున్నా సులువుగా గుర్తిస్తున్నారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో కెమెరాలు నిరంతరంగా పనిచేస్తున్నాయి.

ప్రతిదీ నిక్షిప్తమవుతోంది

ప్రధాన వీధిలో దాతల సహకారంతో కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నాం. పోలీసులు అవగాహన కల్పించి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రోడ్డుపై జరిగే ప్రతి సంఘటన ఫుటేజీలో నిక్షిప్తమవుతోంది. దాతల సహకారంతో మరిన్ని ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటున్నాం. - పుల్లయ్య, మాజీ సర్పంచి, గూడూరు.

గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ

సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో నిరంతరం ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. అక్కడ ఏ సంఘటన జరిగినా కెమెరాల ద్వారా క్షణాల్లోనే తెలుసుకొని చేరుకుంటున్నాం. ఈ కెమెరాలు ప్రజలకు 24 గంటలూ రక్షణ కల్పిస్తాయి. సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో దాతలు ఆర్థికసాయం అందిస్తే వెంటనే ఏర్పాటు చేస్తాం.- వి.చేరాలు, సీఐ, పాలకుర్తి.

ఇవీ చూడండి: కరోనా ప్రభావం నుంచి బయటపడ్డ వాణిజ్య పన్నుల శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.