జనగామ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు నీటి మునిగి చనిపోయారు. బచ్చనపేట మండలం కేశిరెడ్డిపల్లి గెరిమిల్లకుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లి మల్లంపల్లి యాకంరెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. దేవరుప్పులలో గోదావరి కాలువపై నిర్మించిన చెక్ డ్యాం వద్ద ఈతకు వెళ్లి నీటిలో మునిగి మచ్చ శ్రీనివాస్ మరణించాడు. లింగాలఘన్పూర్ మండలం నెలపొగులలో స్నేహితులతో కలిసి దేవాదుల కాలువకు వెళ్లిన ఉపేందర్ ప్రాణాలొదిలాడు. కాలువలో ఈతకు వెళ్లిన స్నేహితుడు నర్సింహా వరద ఉద్ధృతికి కొట్టుకుపోతుంటే... కాపాడటానికి వెళ్లి ఉపేందర్ మరణించినట్లు స్నేహితులు తెలిపారు. మరోవైపు ఉపేందర్ మృతిపై అనుమానం ఉన్నట్లు సోదరుడు నరేష్ ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు