జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. లింగాల ఘనపూర్ మండలం గుమ్మడివెళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ తాము కబ్జాలో ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరుపై పట్టజేశారని... ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడ నిరసన చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు అతనిని అడ్డుకున్నారు.
ఇవీ చూడండి: ఈటల ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా