జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వం విద్యాశాఖపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని, ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్న ఉపాధ్యాయ, జూనియర్ లెక్చరర్, ఎంఇఓ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు కళాశాలలు టీసీలు ఇవ్వట్లేదని... వీటి వల్ల విద్యార్థులు ఒక సంవత్సరం ఖాళీగా ఉంటున్నారని తెలిపారు. దసరా సెలవుల ముందే తమకు న్యాయం చేయాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం