జనగామ జిల్లా ఏనెబావి శివారు పిట్టలోనిగూడేన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సందర్శించారు. గూడెంలోని సమస్యలపై ఆరా తీశారు. పిట్టలోనిగూడెంలోనే ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి 40 మందికి ఆధార్‌కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని అధికారులను కోరారు.
అన్ని కుటుంబాలకు భగీరథ నీరు సరిపడేలా ఇవ్వాలని డీఈ అనీల్‌ను శ్రీనివాస్ కోరారు. విద్యార్థులతో ఆంగ్ల, తెలుగు అక్షరాలను చదివించి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యుత్తు 100 యూనిట్లలోపు వినియోగం ఉన్న వారికి బిల్లులు మినహాయించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా 2018లో గుర్తించిన సమస్యలను మరో నెలరోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు.
- ఇదీ చదవండి:కడు పేదరికంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత!