These Food Should Be Avoided For Beauty Skin : అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎలాగైతే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటామో, అలాగే తీసుకోకూడని ఆహార పదార్థాలు ఉంటాయి. యవ్వనంగా కనిపించాలని, మృదువైన, బిగుతైన చర్మం కావాలని, మేని ఛాయను రెట్టింపు చేసుకోవాలని అన్ని రకాలుగా అందాన్ని సొంతం చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు రకరకాల సౌందర్య చికిత్సలు చేయించుకుంటారు. అయితే ఎలాంటి చికిత్సతోనూ పని లేకుండా సహజంగానే అందాన్ని పెంపొందించుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు తినకుండా ఉంటే సరిపోతుంది అంటున్నారు సౌందర్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా!
ఇవి తింటే ముడతలట : చాక్లెట్లలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరిగిపోయి చర్మంపై ముడతలు ఏర్పడి స్కిన్ డల్‌గా కనిపించేలా చేస్తుంది. అలాగే చక్కెర చర్మంలో ఉండే కొలాజెన్‌పై దుష్ప్రభావం చూపుతుంది. దీనివల్ల చర్మం బిగుతుదనాన్ని కోల్పోయి ముడతలు ఏర్పడుతాయి. చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహారానికి ఎంత దూరంగా ఉంటే చర్మానికి అంత మంచిదన్నమాట.
బ్లాక్‌హెడ్స్, డార్క్ సర్కిల్స్, మొటిమలతో అవస్థలా? - రాత్రివేళ ఇలా చేస్తే సరిపోతుందట!
బయట నూనెల గురించి ఆలోచించాలి సుమీ : అలా కాసేపు బయటికి వెళ్తే చాలు చిప్స్, మిర్చి బజ్జీ, ఛాట్, నూడుల్స్ ఇలా ఏదో ఒకటి తినకుండ ఉండనివాళ్లు ఎందరో. కానీ అలా తినడం వల్ల ఇటు చర్మానికి, అటు ఆరోగ్యానికీ అంత మంచివి కావు. వీటివల్ల మన శరీరంలో జీవక్రియలకు అవసరమైన ఎంజైమ్‌లు వృద్ధి చెందకుండా అడ్డంకి ఏర్పడుతుంది. ఎందుకంటే జీవక్రియలు సాఫీగా సాగి శరీరాన్ని అందంగా తయారు చేయడంతో ఎంజైన్‌ల పాత్ర ఎంతో కీలకం. ఎంజైమ్‌లకు నష్టం కలిగించే ఇలాంటి ప్రాసెస్ట్ ఫుడ్ తీసుకోవడం ఎంత మానుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది. అలాగే ఈ ఆహార పదార్థాల తయారీలో వాడే నూనెల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల చర్మం జిడ్డుగా తయారై మొటిమల సమస్యకు దారితీస్తుంది.
ఉప్పు అధికంగా తినకుంటే : మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఒక భాగం. ముందుగానే ప్యాక్ చేసి ఉంచిన ప్యాకెజ్డ్ ఫుడ్‌లో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కూడా చర్మ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటిని వీలైనంతవరకు తినకపోవడం శ్రేయస్కరం.
గ్త్లెసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పాస్తా, కేక్స్, వైట్ బ్రెడ్ వంటివి తీసుకోవడం వల్ల మొటిమల సమస్య వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వీటిని ఎంత తినకుండా ఉంటే అంత మంచిది.
చలికాలంలో చర్మ సమస్యలా? ఇది పెట్టుకుంటే అన్నీ మాయం! మీరు ట్రై చేయండి!
చిన్నతనంలోనే వృద్ధాప్య ఛాయలా? - ఈ ఫుడ్స్ తినొద్దంటున్న నిపుణులు!