TGSRTC MD VC Sajjanar On Online Betting : అమాయకులను ఆన్లైన్ జూదం(బెట్టింగ్) కూపంలోకి లాగేందుకు కొందరు చిత్ర విచిత్ర వేషాలను వేస్తున్నారంటూ టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఆకతాయి సామాజిక మాధ్యమంలో పోస్టుచేసిన వీడియోను ఆయన షేర్ చేశారు.
తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల వలలో చిక్కుకోవద్దని ఆయన యూత్‌కు హెచ్చరించారు. బెట్టింగ్నకు బానిసై విలువైన భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకోవద్దని సజ్జనార్ హితవుపలికారు. ఈ మేరకు ఆయన వీడియోను షేర్ చేశారు.
చూశారా.. ఎంతకు తెగిస్తున్నారో...!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 19, 2024
అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు.
తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు.
యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి… pic.twitter.com/ziiiYKZqkc
"చూశారా ఎంతకు తెగిస్తున్నారో! అమాయకులను ఆన్లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలను వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ బెట్టింగ్‌కు వ్యసనపరులను చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ఇలాంటి సంఘవిద్రోహ శక్తుల వలలో మీరు చిక్కుకోకండి. బెట్టింగ్‌కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి"- టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్
ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్‌లు బారిన పడి కొంతమంది యువత విలువైన డబ్బును పోగొట్టుకుంటున్నారు. కొందరు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవలకాలంలో ఇలాంటి ఘటనలు మరింతగా పెరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ పెడచెవిన పెట్టడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసైన మిషన్ భగీరథ ఏఈ - వర్క్ ఆర్డర్ల పేరుతో రూ.8 కోట్లు స్వాహా
సరదాగా ఫోన్ పట్టాడు - నెమ్మదిగా బెట్టింగ్‌కు బానిసయ్యాడు - చివరికి?