సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులో ఉందని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ ఎడపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా... స్టేషన్‌ఘన్‌పూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో స్వేర్స్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ దివస్ నిర్వహించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థాయికి ఎదగాలని సీఐ సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జీహెచ్‌ఎంసీగా హైదరాబాద్ ఎలా మారిందో తెలుసా..?