ETV Bharat / state

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చెట్ల తొలగింపు: సీఐ - స్టేషన్​ ఘన్​పూర్​లో రోడ్డు పక్కల చెట్ల తొలగింపు

జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ సర్కిల్​ పరిధిలో రహదారుల వెంటనున్న చెట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో చేపట్టినట్టు సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

road side trees cutting for accidents decrease in station ghanpur
రోడ్డు ప్రమాదాల నివారించేందుకు చెట్ల తొలగింపు: సీఐ
author img

By

Published : Dec 15, 2020, 9:40 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు రహదారి వెంట ఉన్న చెట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్టు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి తెలిపారు. చెట్టు గుబురుగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తీవ్రత ఎక్కువైతే... మృత్యువాత కూడా పడుతున్నారని చెప్పారు.

స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు సీఐ తెలిపారు. ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్​ ధరించాలని, వాహనం నడిపే సమయంలో మద్యం సేవించకూడదని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులకు తరలించకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్, స్టేషన్​ ఘన్​పూర్ ఎస్సైలు మహేందర్, రమేష్​, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఘోర ప్రమాదం: లారీ ఢీకొని నలుగురు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.