రాష్ట్ర ప్రభుత్వం లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిందన్న తెరాస నేతల అసత్యప్రచారాలను ఇకనైనా మానుకోవాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి.. తెరాస అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పొన్నాల కోరారు. 2013లో కాంగ్రెస్ పార్టీ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ చేపట్టి ఉద్యోగాలు కల్పించాలని ప్రయత్నిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని సాకు చూపెడుతోందని విమర్శించారు. నీటి ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం నిరుద్యోగుల కోసం రూ. 3వేల కోట్లు కేటాయించకపోవడం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
ఇదీ చదవండి: ప్రతీ సాక్ష్యం కీలకమే.. వాటిని భద్రపరచండి: హైకోర్టు