జనగామ కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలు, వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.
విదేశాల నుంచి వచ్చిన 64 మందికి నెగిటివ్ వచ్చిందని, మర్కజ్ వెళ్లివచ్చిన 7గురిలో ఇద్దరికి మాత్రమే వైరస్ సోకిందన్నారు. వారితో కలిసిన 116 మందికి కరోనా సోకలేదని తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజయ్య, కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు.
ఇవీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు