సహకార ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ మద్దతుదారులు విజయభేరీ మోగించారు. జనగామ జిల్లాలో మొత్తం 14 సహకార సంఘాల్లో 182 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగగా.. 136 మంది తెరాస మద్దతుదారులు, 43 మంది కాంగ్రెస్ మద్దతుదారులు, ఇద్దరు భాజపా మద్దతుదారులు, ఇతరులు ఒకచోట గెలుపొందారు.
14 సహకార సంఘాల్లో 11 చోట్ల తెరాస మద్దతుదారులు ఆధిపత్యం ప్రదర్శించగా, రెండు చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిక్యం సాధించారు. చిట్టకోడూరు సహకార సంఘంలో మాత్రం తెరాస మద్దతుదారులు 6స్థానాల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు 5 స్థానాల్లో, భాజపా మద్దతుదారులు ఇద్దరు గెలుపొందడం వల్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులపై ఉత్కంఠ నెలకొంది.
జనగామ జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఫలితాలు
నర్మెట సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -12,
కాంగ్రెస్ మద్దతుదారులు -01
బచ్చన్నపేట సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -12,
కాంగ్రెస్ మద్దతుదారులు -01
చిట్టకోడూరు సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -06,
కాంగ్రెస్ మద్దతుదారులు -05, భాజపా మద్దతుదారులు-02
లింగాల ఘన్పూర్ సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -07,
కాంగ్రెస్ మద్దతుదారులు -05,
స్వతంత్ర అభ్యర్థి-01
కళ్లెం సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -13
కాంగ్రెస్ మద్దతుదారులు -00
నిడిగొండ సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -05
కాంగ్రెస్ మద్దతుదారులు -08
కంచనపల్లి సహకార సంఘము (13):
తెరాస మద్దతుదారులు -04
కాంగ్రెస్ మద్దతుదారులు -09
జఫర్గాడ్ సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -12
కాంగ్రెస్ మద్దతుదారులు -01
దేవరుప్పుల సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -11
కాంగ్రెస్ మద్దతుదారులు -02
స్టేషన్ ఘన్పూర్ సహకార సంఘం(13):
తెరాస మద్దతుదారులు -08
కాంగ్రెస్ మద్దతుదారులు -05
పాలకుర్తి సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -13
కాంగ్రెస్ మద్దతుదారులు -00
ఎల్లరాయిని తొర్రూరు సహకార సంఘం(13):
తెరాస మద్దతుదారులు -10
కాంగ్రెస్ మద్దతుదారులు -03
జనగామ సహకార సంఘం(13):
తెరాస మద్దతుదారులు-11
కాంగ్రెస్ మద్దతుదారులు-02
కొడకండ్ల సహకార సంఘం (13):
తెరాస మద్దతుదారులు -12
కాంగ్రెస్ మద్దతుదారులు -01
ఇవీ చూడండి: పట్టణ ప్రగతి అజెండాగా రేపు కేబినెట్ భేటీ