ఈ బైక్ ఏంటి కొత్తగా ఉందని అనుకుంటున్నారా.. ఇదొక బ్యాటరీ బైక్, దీనిని జనగామ జిల్లాకు చెందిన రైతు తోటపల్లి రాజిరెడ్డి రూ. 35 వేల వెచ్చించి సంగారెడ్డిలో కొనుగోలు చేశాడు. దీనికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
30 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ ద్విచక్ర వాహనం, రోజుకు 3 గంటలు ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు ప్రయనించ వచ్చని రైతు తెలిపారు. దీనికి రవాణా శాఖ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదన్నారు. పొలం పనులకు, సులభంగా పిండి బస్తాలు, పాల రవాణాకు చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు.
ఇదీ చూడండి : ఔరంగాబాద్‌లో 3 తెలంగాణ విద్యార్థుల మృతి