జనగామ జిల్లాలో ఎన్నడూ ఊహించని విధంగా ప్రధాన జలాశయాలన్నీ (చీటకోడూరు, మల్లన్న గండి, వెల్దండ, బొమ్మకూరు, కన్నెబోయిన గూడెం, నవాబ్‌పేట, అశ్వరావుపల్లి, స్టేషన్ ఘన్పూర్) జల సిరులై ఉప్పొంగుతున్నాయి. కొన్నేళ్లుగా అంతంత మాత్రం నీటితో ఉన్న జలాశయాల్లోకి ఇటీవల కురిసిన వర్షాలతో సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చి చేరింది. ఫలితంగా జలాశయాలు నిండుకుండల్లా మారి.. జిల్లాలో పంటల సాగు పెరిగింది.
సమృద్ధిగా భూగర్భజలాలు..
ఇన్నాళ్లు వ్యవసాయానికి కష్టంగా ఉన్న ఈ ప్రాంతంలో.. ఇప్పుడు వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడం, జలాశయాలు పూర్తిగా నిండటం వల్ల అధిక మొత్తంలో పంటలు సాగుచేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వచ్చే ఏడాది వరకూ సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచూడండి.. సచివాలయ ప్రాంగణంలో 3 ప్రార్థనా మందిరాలు: కేసీఆర్