ETV Bharat / state

జయసారథి రెడ్డిని గెలిపించాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి - Janagama District Latest News

ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థి జయసారథి రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరిస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తోందని మండిపడ్డారు.

MLC Alugubelli Narsireddy participated in a media conference organized by UTF
యూటీఎఫ్ సమావేశంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
author img

By

Published : Mar 5, 2021, 5:29 PM IST

ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థి జయసారథిరెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. జనగామ జిల్లా కేంద్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరిస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తోందని మండిపడ్డారు. తెరాస నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన విద్యాసంస్థలను యూనివర్సిటీగా మార్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల సమస్యలపై ఒక్క రోజూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

వీసీలను నియమించలేని స్థితిలో ప్రభుత్వం..

కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరేలా రైతు వ్యతిరేక చట్టాలు చేసి.. అన్నదాతల్ని అన్యాయం చేస్తున్నారన్నారని నర్సిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఒక్క విశ్వవిద్యాలయానికీ వీసీని నియమించలేని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న భాజపా, తెరాసలను ఓడించి.. తగిన బుద్ధి చెప్పాలన్నారు.

ఇదీ చూడండి: ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేయండి : కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.