కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొని.... ఎమ్మెల్యే రాజయ్య బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలోని జఫర్‌గఢ్ మండలం కునూరుకు చెందిన... ఘనపూర్ మార్కెట్ డైరెక్టర్ చౌదరి మల్లయ్య కొవిడ్‌తో పోరాడుతూ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మృతి చెందారు.
స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. కొవిడ్‌కు మనోధైర్యాన్ని మించిన మందు లేదని... స్వీయ నిర్బంధమే రక్షణ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మల్లయ్య మృతితో రాజకీయంగా మంచి అనుచరుడిని కోల్పోయానని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. కొవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రజలకు ఉన్న అపోహలు తొలగించడంతో పాటుగా... మృతుడి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపేందుకు దహన సంస్కారాలకు హజరయ్యానని రాజయ్య తెలిపారు.
ఇదీ చూడండి: లాక్‌డౌన్‌తో ఉపాధి కరవాయె.. పిల్లలకు పట్టెడన్నం వరమాయె.!