దేవాదుల ఎత్తిపోతల పథకంలోని రెండో మోటర్‌ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి , మంత్రి ఆదేశాలు ఇచ్చినా సీఈ బంగారయ్య పట్టించుకోవడం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మండిపడ్డారు. ఫోన్ చేసి అడిగితే ఫోన్ పెట్టెయ్యమని అంటున్నారన్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
తపసుపల్లి జలాశయంలో చుక్క నీరు లేదని... ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పని చేస్తున్న సీఈ బంగారయ్యపై చర్యలు తీసుకోవాలని కోరారు.