జనగామలో స్వచ్ఛ్ జనగామ జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పట్టణంలో తిరుగుతూ పనులను పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రూ.70 కోట్ల నిధులతో సదుపాయాలు
గత 60 ఏళ్లలో పాలకులు పట్టించుకోకపోవడం వల్ల జనగామ ప్రాంతం వెనుకబడిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణాన్ని బాగు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే. ఇప్పటివరకు రూ.70 కోట్ల నిధులతో సదుపాయాలతో పాటు సుందరీకరణ పనులు చేస్తున్నామని తెలిపారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు