జనగామలో నియంత్రిత పంటల సాగువిధానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సదస్సులో పంటల ప్రణాళిక, రైతులు సాగుచేయాల్సిన పంటలు, మార్కెటింగ్, డిమాండ్లపై అన్నదాతలకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులంతా సాగుచేయాలని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు.. లాభసాటి పంటలు వేసి రైతులు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. శాస్త్రవేత్తలు రూపొందించిన పంటలను ప్రణాళిక సిద్ధంగా ఉందని... రైతులు పంటను వేయడమే ఆలస్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు వంటి పథకాలను అందజేస్తాం. రైతు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుందని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులను రాజుగా చూడాలన్నదే ఆయన లక్ష్యం.
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఇదీ చూడండి: 'లాక్డౌన్తో లాభం లేదు- ఇంకా చాలా వ్యూహాలున్నాయి'